Jagathguru Bhodalu Vol-6        Chapters        Last Page

ఆత్మజ్యోతి

కిం జ్యోతి స్తవభానుమానహానిమేరాత్రౌ ప్రదిపాదికం

స్యా దేవం రవిదీపదర్శన విధౌకింజ్యోతిరాఖ్యాహిమే,

చక్షు స్తస్య నిమీలనాదిసమయేకింధీర్ధియో7దర్శనే

కిం, తత్రాహ మతో భవా న్పరమకం జ్యోతి

స్తదస్మి ప్రభో!||

ఇది భగవత్పూజ్యపాదులు రచించిన ఏకశ్లోకి, ప్రశ్నోత్తరరూపంలో ఆచార్యులవారు ప్రతిజీవిలోనూ ఉన్న సనాతన ఆత్మపదార్థాన్ని ఇందు వివరించారు.

ప్రశ్న :- లోకంలో ఇన్ని వస్తువులను చూస్తున్నావు కదా!

ఈ వస్తువు ప్రకాశకమైన జ్యోతి ఏది?

ఉత్తరం:- పగటిపూట సూర్యుడు, రాత్రి ప్రదీపచంద్రాదులు.

ప్రశ్న :- మంచిది. ఐతే ఈసూర్యుని, చంద్రుని నీవు దేని సాయంతో చూస్తున్నావు?

ఉత్తరం:- నేత్రము.

ప్రశ్న :- కన్నులు పనిచేయనపుడు లేదా మూసుకొన్నపుడు దేనితో చూస్తున్నావు?

ఉత్తరం:- బుద్ధి.

ప్రశ్న :- ఈ బుద్ధిని చూచునది ఏది?

ఉత్తరం:- నేను. అనగా నా ఆత్మయే ద్రష్ట.

ప్రశ్న :- అయితే జ్యోతుల కెల్లను జ్యోతి- పరంజ్యోతి నీవే కదా?

ఉత్తరం:- ప్రభూ! అవును. మీరూ నేనూ ఇరువురమూ ఆ పరంజ్యోతి స్స్వరూపులమే!

గురుశిష్యుల మధ్య జరిగివ సంభాషణరూపంలో భగవర్పాదులవారు వేదాంతములో చెప్పబడిన ఆత్మస్వరూపమును వివరించారు.

ఈ రోజు దీపావళి. దీపావళినాడు దీపజ్యోతుల మధ్య కొంతసేపైనా మనస్సులను అంతర్ముఖం చేసి, ఆ జ్యోతిషాం జ్యోతిని- ఆపరమాత్మను మన అంతర్యామిని ధ్యానింతుముగాక! ఈ ధ్యానానందలహరిలో కొన్ని క్షణములైనను తేలుదుము గాక!

( 6 - 12 )

దీపావళి భారతదేశమంతా అందరూ చేసుకొనే జాతీయోత్సవము. దీనిని అన్ని ఆశ్రమములవారూ పాటిస్తారు. సంన్యాసులు సైతము ఈ పండుగనాడు ప్రాతఃకాలమున తలంటుకొని ఆత్మజ్యోతిని ధ్యానించవలెనని 'ధర్మసింధువు'-చెపుతోంది.

అంతర్జ్యోతి ర్బహిర్జ్యోతిః ప్రత్యగ్జ్యోతిః పరాత్పరః,

జ్యోతి ర్జ్యోతి స్స్వయంజ్యోతి రాత్మజ్యోతిః

శివో7స్మ్యహం.


Jagathguru Bhodalu Vol-6        Chapters        Last Page